• తెలపంటి బుజ్జి ని అభినందించిన జనసేన నాయకులు కత్తిపూడి బాబి…
  • భోజనాలు ఏర్పాటు దాత బుజ్జికి అభినందించిన ” స్టార్ లైట్ ఫౌండేషన్ ” బృందం..

మన న్యూస్ శంఖవరం (అపురూప్) : స్త్రీల పట్ల జనసేన పార్టీకి ఉన్న అపారమైన గౌరవ భావంతో నిండు గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ శంఖవరం మండల ఉపాధ్యక్షుడు తలపంటి అప్పారావు (బుజ్జి) అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష యోజన పథకం లో భాగంగా నెలవారి గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిమిత్తం తరలివచ్చిన వారికి స్టార్ లైట్ పౌండేషన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ శంఖవరం మండల ఉపాధ్యక్షుడు తలపంటి అప్పారావు (బుజ్జి) సుమారు వందమందికి భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు సంయుక్తంగా భోజనాలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) మాట్లాడుతూ, నిరుపేదల పక్షాన గత కొన్ని సంవత్సరాల నుండి సహాయ సహకారాలు అందిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తలపంటి బుజ్జికి అభినందనలు తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతంలో భాగమైన మహిళలను గౌరవిస్తూ, నిరుపేదలకు మరెన్నో సహాయ సహకారాలు అందించాలని సూచించారు.అనంతరం తలపంటి బుజ్జి మాట్లాడుతూ, మండలంలో నిరుపేదలను గుర్తించి అనేక విధాలుగా సహాయ సహకారాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, స్వయ గ్రామమైన నెల్లిపూడి అభివృద్ధి ధ్యేయంగా ముందడుగు వేస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్టార్ లైట్ పౌండేషన్ సభ్యుడు గునపర్తి అపురూప్ మాట్లాడుతూ, స్త్రీలు పట్ల అంకితభావంతో నిండు గర్భిణీలకు భోజనాలు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ శంఖవరం మండల అధ్యక్షులు గాబు సుభాష్, స్టార్ లైట్ పౌండేషన్ సభ్యులు కొంగు రమేష్, బత్తిన తాతాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *