* *సస్ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారం…*

మన న్యూస్ కోటనందూరు (అపురూప్) స్వరాజ్య అభ్యుదయ సేవాసమితి (ఎస్ఏఎస్ఎస్) ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కె.ఈ చిన్నాయపాలెం గ్రామంలో మా తోట పథకంలో భాగంగా ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి కె. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల బారి నుండి పశువులను కాపాడుకోవాలని రైతులకు సూచించారు తమ పశువులు, ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకల పట్ల అప్రమత్తంగా ఉండి సీజనల్ వ్యాధులను ముందుగానే గుర్తించి నివారణ పై దృష్టి సారించాలని తెలియజేశారు. ఇబ్బందుల పరిస్థితులలో పశు వైద్య శాఖ అధికారికి తెలియజేయాలన్నారు అనంతరం నాబార్డ్ డిడిఎం డాక్టర్. సోమునాయుడు మాట్లాడుతూ, ఈ వైద్య శిబిరంలో రైతులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే పశు వైద్య శిబిరాలలో తమ పశువులకు సంబంధించిన వ్యాధులపై ఉన్న సమస్యలను సంబంధించి అధికారులను అడిగి నిష్పత్తి చేసుకోవాలన్నారు అనంతరం గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలకు చికిత్స చేశారు. పశువులను పరీక్షించి కావలసిన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సభ్యులు ఎ రమేష్, టీడీఎఫ్ సభ్యులు స్వరాజ్య అభ్యుదయ సేవా సమితి బృందం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *