


మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండల కేంద్రంతో పాటు వడ్డేపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ లు కలిసి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రజా ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వడంతో రైతులు రికార్డు స్థాయిలో వరి పండించారని తెలిపారు.
ధాన్యం కొనుగోలు చేసిన రెండు,మూడు రోజుల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు జమ చేస్తుందని అన్నారు. రైతుల దళారులను నమ్మి మోసపోవద్దు అని అన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బిక్షపతి,ఏపీఎం రామ్ నారాయణ గౌడ్, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, నాయకులు ప్రజా పండరీ,అనిస్,ప్రవీణ్ కుమార్,రాము.తదితరులు ఉన్నారు.