

మనన్యూస్:ఉదయం ఎనిమిది గంటలు దాటుతున్న అంగన్వాడి సెంటర్లకు చేరుకోని అంగన్వాడి కార్యకర్తలు,అంగన్వాడీ కార్యకర్తలకు సిడిపిఓ సునీతకు మధ్య ఎలాంటి రహస్య ఒప్పందం ఉందో సూపర్వైజర్లకే తెలియాలి. అంగన్వాడి సెంటర్లకు పిల్లలు రాకున్నా అంగన్వాడి కార్యకర్తలు సెంటర్లను తమకు ఇష్టం వచ్చినప్పుడు తెరుస్తున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వలస ఉద్యోగాలు చేస్తున్న అధికారులు తమ ఇంటి నుండి బయలుదేరి ఏ మధ్యాహ్నానికో కానీ ఆఫీసులకు రావడం లేదు.. అలాంటప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన సూపర్వైజర్లు ఒకరి తప్పులను ఒకరు కప్పిపుచ్చుకుంటూ రహస్య ఒప్పందాలతో సెంటర్లలో తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం ఇక్కడ సామాన్యమైన విషయం అని సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది అంటున్నారు.. సిడిపిఓ సునీత ఆఫీస్కు రావడానికి మధ్యాహ్నం సమయం అవుతుంటే ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న ఈ కాలంలో ఆమె ఎక్కడ తనిఖీలు చేయగలరని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వరికుంటపాడు మండలంలో మొదటి నుండి ప్రమోషన్ల కోసం పదవీల కోసం పైరవీలు తప్ప సెంటర్లను సక్రమంగా నడిపించాలన్న ఉద్దేశం అక్కడ లేనట్టు కనిపిస్తుంది.. అంగన్వాడి సెంటర్లను సక్రమంగా నిర్వహించాల్సిన సిబ్బంది ఎన్ని పొరపాట్లు చేస్తున్న సిడిపిఓ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది
