

మన న్యూస్: కొత్త గూడెం జిల్లా, పినపాక మండలం ఇ.బయ్యారం క్రాస్ రోడ్డు లోని ఎక్స్ లెంట్ భాషా హైస్కూల్లో గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇ.బయ్యారం సిఐ వెంకటేశ్వర్ రావ్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుని కష్టంగా కాకుండా ఇష్టపడి చదవాలని అన్నారు.ఇష్టపడి చదువే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని క్రమశిక్షణతో దానికి అనుగుణంగా చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కరోనా అనంతరం విద్యార్థులు సెల్ ఫోన్ కు ఎక్కువగా ఆకర్షితులయ్యారని, దానివలన మంచి కంటే చెడు ప్రభావం పిల్లలపై ఉంటుందని అన్నారు.కావున విద్యార్థులను సెల్ఫోన్ వాడకానికి దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ వేడుకలకు విశిష్ట అతిధులుగా హాజరైన పినపాక ఎం.ఇ.ఓ. నాగయ్య మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలైన పినపాక, కరకగూడెం మంగపేట మండలాలలోని పేద విద్యార్థులకు ఎక్స్లెంట్ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా సాధారణమైన విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధిస్తున్నారని అన్నారు ఈ వేడుకలకుఇ. బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ కరక గూడెం ఎస్సై రాజేందర్,ఎక్సలెంట్ విద్యాసంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్ విశిష్ట అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.అనంతరం గత నాలుగు రోజుల నుండి బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించగా విజయం సాధించిన విద్యార్థులకు అతిధుల ద్వారా బహుమతులను అంద చేశారు ఈ వేడుకలలో విద్యార్థుల యొక్క నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తరువాత ఎక్సలెంట్ విద్యా సంస్థల చైర్మన్ యూసఫ్ రెక్టర్లు కలిసి పాఠశాలలోని బోధన, బోధ నేతర సిబ్బందిని శాలువాతో సత్కరించి బహుమతులను అందించారు.ఈ కార్యక్రమానికి ఎక్సలెంట్ విద్యాసంస్థల డైరెక్టర్లు యాకూబ్ షరీఫ్ , నర్సారెడ్డి , నరేంద్ర గారు, ప్రిన్సిపాల్ సురేష్ సీనియర్ ఫ్యాకల్టీ వలసల మోహన్ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.