మణుగూరు ఏరియా సింగరేణి వైద్యశాల ప్రసూతి వైద్య నిపుణురాలిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె. మౌనిక

మన న్యూస్ : హర్షం వ్యక్తం చేసిన సింగరేణి ఉద్యోగులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పట్ల సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సి ఎం ఓ) కి కృతజ్ఞతలు తెలిపిన సామాజిక సేవకులు కర్నె బాబురావు పినపాక నియోజకవర్గం, ఏరియా సింగరేణి కార్మికుల తరపున తమ అభ్యర్థనను మన్నించి మణుగూరు ఏరియా సింగరేణి ఆసుపత్రిలో ప్రతి గురువారం సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉండే విధంగా డిప్యూటేషన్ పై ప్రసూతి వైద్య నిపుణురాలిని బాలల దినోత్సవం రోజున నియమించడం పట్ల ప్రముఖ సామాజిక సేవకులు కర్నె బాబురావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి. సుజాత కి పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ అభ్యర్థన మన్నించి ఇచ్చిన మాట ప్రకారం మరుసటి రోజే మణుగూరు ఏరియా హాస్పిటల్ లో డిప్యూటేషన్ పై జె. మౌనిక ని నేను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం సింగరేణి ఏరియా హాస్పిటల్ లో ప్రసూతి వైద్య నిపుణురాలిగా బాధ్యతలు చేపట్టిన జే. మౌనిక ని అక్కడికి వైద్యానికి వచ్చిన మరికొందరితో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గర్భిణీల మనసు గెలుచుకునేలా వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. ఏరియా హాస్పిటల్ ఉప ముఖ్య వైద్యాధికారిని మేరీ కుమారి కి వైద్యులు డాక్టర్ శేషగిరిరావు కి సురేష్ కి, వెంకట రమణయ్య కి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు గర్భిణీ మహిళలు కూడా పాల్గొన్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం