

మనన్యూస్,సాలూరు:ప్రకృతి సేద్యం చేయాలనుకున్న రైతులు అలాగే భూమిని కాపాడుకోవాలనుకున్న రైతులు తప్పనిసరిగా పిఎండిఎస్ నవధాన్యాలు కొనుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. తాడూరు గ్రామంలో సిఆర్పి తిరుపతి నాయుడు,ఆధ్వర్యంలో ఇంటింటికి నవధాన్యాలు కార్యక్రమంలో పాల్గొంటూ, ప్రకృతి సేద్యానికి తొలిమెట్టు నవధాన్యాలు అని అన్నారు. ముందుగా రైతులతో ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాచిపెంట మండలంలో రైతులు మొక్కజొన్న ఏక పంట విధానాన్ని పాటించడం వలన కనీసం ఒక్క శాతం ఉండాల్సిన సేంద్రీయ పదార్థం 0.01 శాతం మాత్రమే ఉందని మట్టి నమూనా పరీక్షల విశ్లేషణ ఫలితాలలో ఈ విషయం వెల్లడైందని అన్నారు. భూమిలో సేంద్రీయ పదార్థం లేనప్పుడు ఎన్ని రసాయన ఎరువులు వాడినప్పటికీ క్రమేపి దిగుబడులు తగ్గుముఖం పడుతూనే ఉంటాయని క్రమంగా భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందని తెలిపారు. రసాయన ఎరువులైన కాంప్లెక్స్ ఎరువులు పొటాష్ ఎరువు కు సంబంధించిన గనులు త్వరలో అంతరించిపోతాయని కాబట్టి రైతులు పీఎండీఎస్ నవధాన్యాలతో తమ నేలను రక్షించుకోవాలని కోరారు అనంతరం ఇంటింటికి వెళ్లి రైతులకు నవధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు.పిఎండిఎస్ నవధాన్య ల వలన లాభాలు పంటకు కావలసిన అన్ని పోషకాలు అందుతాయి,నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
సారవంతమైన మట్టిని ఎండ వాన గాలుల నుండి రక్షిస్తుంది నేలలో జీవ వైవిధ్యం పెంచుతుంది
మిత్ర పురుగుల వృద్ధి జరుగుతుంది
వివిధ వేరు వ్యవస్థలు వివిధ ఉపయోగపడే సూక్ష్మజీవుల వృద్ధికి తోడ్పడతాయి
పంటలో కలుపు సమస్య తగ్గుతుంది
ప్రధాన పంటకు చీడపీడల ఉధృతి తగ్గుతుంది
పశు పోషణ వృద్ధి పాల వృద్ధి జరుగుతుంది
పంటకు కావలసిన సూక్ష్మ మరియు స్థూల పోషకాల లభ్యత పెరుగుతుంది
అనంతరం రైతు డి రాములు తో 200 కేజీల ఘన జీవామృతం తయారు చేయించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఐ సి ఆర్ పి లు నారాయణరావు శివశంకర్ గ్రామ వ్యవసాయ సహాయకులు ఈదుబిల్లి శ్రీను మరియు రైతులు పాల్గొన్నారు.
