oplus_8192

సుడిగాలి పర్యటన నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

కార్యకర్తలకు భరోసనే నా అజెండా

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులకు నేను అండగా ఉంటా అధైర్య పడకండి అన్నారు. శుక్రవారం ఎస్ఆర్ పురం మండలంలోని పెద్ద తయ్యూరు లో వైసీపీ కార్యకర్త వెంకటేష్ సాయికుమార్ ను, 49 కొత్తపల్లి మిట్ట లో మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్ గోవిందస్వామి, విశ్రాంతి ఉపాధ్యాయులు దొరస్వామిz సుందర్ మూర్తి రెడ్డిని పరామర్శించారు. అలాగే వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు నాంచారమ్మ టీవీలో మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు రమేష్ ను పరామర్శించారు.ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తకు నాయకులకు ఏ కష్టం వచ్చినా.. ఎవరైనా ఇబ్బంది పెట్టించిన… అక్రమ కేసులు బనాయించిన… ఎవరు అధైర్య పడకండి అని ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని… అందరికీ భరోసా కల్పించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి… రానున్న రోజుల్లో కార్యకర్తలకు నాయకులకు పెద్దపీట వేస్తారని… ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు గురవారెడ్డి, ఎంపీపీ సరిత జనార్ధన్,జిల్లా క్రియాశీలక కార్యదర్శి విజయబాబు, గంగాధర్ నెల్లూరు పంచాయత్ రాజ్ వింగ్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, గంగాధర్ లో యూత్ నాయకుడు శ్యామ్, వాలంటరీ విభాగ అధ్యక్షులు అశోక్ రెడ్డి, నియోజకవర్గ కల్చర్ యాక్టివిటి అధ్యక్షులు నాగమణి,రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కాలప్ప, మండల కో ఆప్షన్ సభ్యులుయేసయ్య,నాయకులు భూపతి రెడ్డి,కోటిరెడ్డి బాబు, సుధా, కుమార్, బాబు, శేషు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *