

అభయాంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ..!
మనన్యూస్,కలిగిరి:కలిగిరి మండలం ఎరుకల రెడ్డి పాలెం లో షేక్ మస్తాన్ నూర్జహాన్ దంపతులచే సొంత నదులతో నిర్మాణం చేసిన వాటర్ ప్లాంట్ ను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ దంపతుల చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. అదేవిధంగా అదే గ్రామంలో అభయ ఆంజనేయస్వామి విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ దంపతుల చేతుల మీదుగా భూమి పూజ చేశానని చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్న ఊరు కన్నతల్లి ని మరువకూడదు అన్న దృఢ సంకల్పంతో, అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నినాదంతో, తమిళనాడులోని చెన్నైలో స్థిరపడి పుణ్యభూమి రుణం తీర్చుకునేందుకు సొంత గ్రామంలో షేక్ మస్తాన్ నూర్జహాన్ దంపతులు తమ సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ను మరియు అభయాంజనేయ స్వామిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వారు చేస్తున్న సేవలను కొనియాడి ప్రశంసించారు. అదేవిధంగా అనేక గ్రామాల రామాలయాలకు విగ్రహాలు ఏర్పాటు, అభాగ్యులకు ఆర్థిక సహాయం షేక్ మస్తాన్ నూర్జహాన్ దంపతులు అందజేశారు. ముందుగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ దంపతులకు మండలం మరియు గ్రామ నాయకులతోపాటు, షేక్ మస్తాన్ నూర్జహాన్ దంపతులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు పూల మాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, తెలుగు రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు,కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, మండల నాయకులు గ్రామ నాయకులు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు.
