

మనన్యూస్,ఏప్రిల్ 2 NRPT దేశవ్యాప్తంగా ఏప్రిల్ 2న నేషనల్ EMT డే కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లు ప్రమాద బాధితులని హాస్పిటల్ చేర్చేలోపు అంబులెన్స్ గోల్డెన్ అవర్స్ లోనే ప్రమాద బాధితుడికి ప్రథమ చికిత్స చేస్తూ, ఎన్నెన్నో విలువను క్షతగాత్రుల ప్రాణాలు కాపాడుతున్నందుకు గాను ప్రభుత్వం ఈ వేడుకలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహిస్తుంది ప్రధానంగా ఈఎంటి లు గర్భిణీ స్త్రీలు, పాముకాటు బాధితులు, రోడ్డు ప్రమాద బాధితులు, అత్యవసర మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న ఒక్క ఫోన్ కాల్ తో 24 గంటలు అందుబాటులో ఉంది ఉండి వారి యొక్క విలువైన ప్రాణాలు కాపాడడంలో వీరి పాత్ర ఎంతగానో ఉందని& అలాగే మీరు చేస్తున్న సేవలను గుర్తింపు గుర్తింపుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం అధికారి రవికుమార్ మరియు నారాయణపేట జిల్లా సూపర్వైజర్ రాఘవేంద్ర గారు నారాయణపేట జిల్లా కేంద్రంలో EMT DAY ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
