మనన్యూస్,తిరుపతి:ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ లో మంగళవారం గేట్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. మార్కెట్ లో క‌నీస వ‌స‌తులు మెరుగుప‌రచనున్నట్లు ఎమ్మేల్యే తెలిపారు. మార్కెట్ లో వినియోగదారులు పరిశుభ్ర వాతవరణంలో కొనుగోలు చేసేలా చూడాలని వ్యాపారులను ఆయన కోరారు. రిటైల్, హోల్ సేల్ వ్యాపారులు కలిసిమెలిసి మెలగాలని ఆయన సూచించారు. ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక మార్కెట్ టెండ‌ర్ల‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. 2023 – 2024 లో 2 కోట్ల 58 లక్షలు పలుకగా 2024 – 2025 లో 4 కోట్ల 81 లక్షలు, 2025 – 2026 లో 4 కోట్ల 76 లక్షలు టెండర్ పాడటమే దీనికి ఉదాహరణ అని ఆయన చెప్పారు.
గత పాలనలో నాయకులు తమ బినామీలను పెట్టి తక్కువకు టెండర్స్ దక్కించుకుని మున్సిపాల్టీ కి నష్టం కలిగించారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అన్నారెడ్డి యువరాజ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు ఎస్కే బాబు, అన్నా అనితా యాదవ్, పులిగోరు మురళీ, దొరై రాజ్, మునిచంద్ర, రాజా రెడ్డి, మహేష్ యాదవ్, కేఎంకే లోకేష్, కళావతి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *