

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మన న్యూస్ ,ఎస్ఆర్ పురం :-
తెలుగుదేశం పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ అన్నారు శనివారం గంగాధర్ నెల్లూరు మండలం నెల్లెపల్లి గ్రామం వద్ద తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆంధ్ర రాష్ట్ర కోసం పార్టీని స్థాపించి నేటికీ 43 సంవత్సరాలు అవుతుందని ఆయన చేసిన సేవలు అమోఘం అని కొనియాడారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుష్పరాజ్ టి ఎన్ టి యు సి కార్యదర్శి దేవరాజులు నాయుడు మాజీ ఎంపిటిసి సుబ్రహ్మణ్యం గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్, నాయకులు కేసి సుబ్రహ్మణ్యం వెంకటరెడ్డి ముని కృష్ణారెడ్డి భూపాల్ విజయ్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.