

ప్రజా పరిషత్ అధికారులతో సదస్సు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!
మనన్యూస్,వింజమూరు:ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలను అభివృద్ధి సంక్షేమాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ప్రజా పరిషత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రజా పరిషత్ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రీవెన్స్ డే లో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలియజేశారు.మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద పని దినాలను పెంచి ఉపాధి కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ప్రతి పని ఉపయోగపడేలా ఉండాలన్నారు. రైతులను నాయకులను భాగస్వామ్యం చేసుకుంటూ పనులు చేయాలన్నారు. గత సంవత్సరంలో మండలాల వారీగా చేసిన పని వివరాలు బడ్జెట్ తదితర అంశాలను చర్చించారు. ప్రభుత్వానికి ప్రజలకు అధికారులు వారధిగా నిలిచి ప్రభుత్వానికి నాకు మంచి పేరు తేవాలని తెలిపారు. జఠిలమైన సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని జిల్లా అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిద్దామని అధికారులకు ఎమ్మెల్యే తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎనిమిది మండలాల ఎంపీడీవోలు, ఈవో పి ఆర్ డి లు ఎనిమిది మండలాల టిడిపి మండల కన్వీనర్లు నాయకులు తదితరులు ఉన్నారు.
