

మనన్యూస్,నెల్లూరు:తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలు దాటి చాటి చెప్పిన మగధీర…..
రంగస్థలం అయినా రాజకీయమైనా,సేవా భావమైనా మెగా ఫ్యామిలీ తర్వాతే అంటూ అని చాటి చెబుతూ…తండ్రికి తగ్గ తనయుడిగా బాబాయికి తగ్గ వినయుడిగా అన్నిటికీ మించి యువతకు రోల్ మోడల్ గా నడుచుకుంటూ మా పెద్దాయన కొణిదల చిరంజీవి సేవా భావాన్ని ముందుకు తీసుకుపోగల వారసుడు మా పెద్ది కొణిదల రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం అని గునుకల కిషోర్ అన్నారు.
నెల్లూరు రెడ్ క్రాస్ లో గురువారం ఉదయం రాంచరణ్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పరిచి మెగా ఫ్యామిలీ సేవా భావాన్ని తమ భుజ స్కందాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్న జిల్లా జనసేన పార్టీ మరియు చిరంజీవి యువత నాయకులకు పేరుపేరునా నమస్కారాలు తెలియజేస్తున్నాను గునుకుల కిషోర్ అని అన్నారు.
