

మనన్యూస్,నెల్లూరు,రూరల్:నెల్లూరుజిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నందు 15లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రసూతి హాస్పిటల్ లో ఓ.పి విభాగాలను గురువారం ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పేద, నిరుపేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.స్థానిక ఎమ్మెల్యేగా ఈ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా అనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
రాబోయే రోజుల్లో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు స్థానిక ఎమ్మెల్యే గా కృషి చేస్తా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు మడపర్తి శ్రీనివాసులు గౌడ్, బోడె వీర బ్రహ్మారెడ్డి, మొగరాల సురేష్, దారా మల్లి, అబీదా సుల్తానా, హాస్పిటల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
