

మనన్యూస్,తిరుపతిఃగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రుయా ఆస్పత్రి ఆవరణలో తిరుపతి రామ్ చరణ్ యువశక్తి సభ్యులు గురువారం మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేదలకు అన్నదానం పంపిణీ చేశారు. రామ్ చరణ్ ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే ఆరణి తెలిపారు. ఈ కార్యక్రమంలో పగడాల మురళీ, రాజారెడ్డి, బాబ్జీ, కెఎంకే లోకేష్, జీవకోన సుధా, సాయి, వేణు, త్రిలోక్, రుద్రకిషోర్, వెంకీ, తులసి, హేమంత్ కుమార్, రాజేష్ ఆచ్చారి, ఆముదాల తులసి, ప్రభాకర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
