

మనన్యూస్,కామారెడ్డి:జిల్లా ఎస్ పి కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో 64 సెంటర్లలో ఎస్ ఎస్ సి ఎగ్జామ్స్ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న సమయంలో జుక్కల్ జెట్ పి హెచ్ ఎస్ సెంటర్లో కొంతమంది మాల్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయడం జరిగిందని వెంటనే డీఈవో మరియు పోలీసులు కలిసి ఈ ప్రయత్నాన్ని భగ్నం చేశారు.
ఇందులో కీలక పాత్ర పోషించిన (6) ఆరుగురిని అరెస్టు చేయడం జరిగింది. CCL-1 & CCL-2 ను జువనైల్ కోర్టు నందు హాజరు పరచడం జరగుతుందని అన్నారు
పూర్తి వివరాలకు వెళ్తే
విద్యార్థి వాళ్ళ తండ్రి తన కొడుకుకు పదవ తరగతి పరీక్షలో సహాయం చేసే ప్రయత్నంలో ఎగ్జామ్స్ సెంటర్ లోకి తాత్కాలికంగా వాటర్ సప్లై కోసం నియమితులైన ఒక వ్యక్తితో కొన్ని ప్రశ్నలు బయటకు తెప్పించే ప్రయత్నం చేశాడు. బయట సంజయ్ అనే వ్యక్తి ఈ ప్రశ్న సేకరించడం జరిగింది, అతని దగ్గర నుండి కొంత మంది మీడియా వారు ఈ ప్రశ్నలను కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. విషయాన్ని తెలుసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఈ ప్రయత్నంలో ఉన్న వారందరినీ గుర్తించి వారిని పట్టుకుని విచారిస్తున్నామని అన్నారు మిగతావారు పరార్ లో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలియజేశారు ఈ కేసులో చాకచకంగా వ్యవహరించిన వారిని జిల్లా ఎస్పీ అభినందించారు
