

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఒకవైపు అంతరించిపోతున్న అడవుల వల్ల వన్యప్రాణులకు అడవుల్లో ఉండవలసిన జంతువులు గ్రామాలపై పడుతున్నాయి. ముఖ్యంగా అడవిలో తినడానికి కావలసిన ఆహారం లేక, మరోపక్క త్రాగడానికి నీళ్లు లేక వన్యప్రాణులు గ్రామాల మీద పడుతున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చిరుత పులుల దాడులు పెరిగిపోయిన విషయము పాఠకులకు తెలిసిందే. దీనికంతటి కారణం అడవులు అంతరించడమే. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు నీటిని తాగడానికి అటవీశాఖ ప్రత్యేకంగా సాసర్లు ఏర్పాటు చేసి వాటిలో నీటిని నింపాల్సి ఉండగా, ఆ దిశగా అటవీ శాఖ అధికారులు అడుగులు వేయకపోవడంతో వన్యపణులు గ్రామాలపై పడుతున్నాయి. బాన్స్వాడ మొదలుకొని కామారెడ్డి వరకు కొన్నిచోట్ల రోడ్డు పక్కన సాసర్లు అటవీ శాఖ అధికారులు నిర్మించారు. కానీ వాటిలో నీటిని నింపుదామన్న ఆలోచన అధికారులకు కలగకపోవడం వల్ల, సాసర్లు నీరు లేక బోసిపోయాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా కోతులు రోడ్డు పక్కన తిరుగుతుంటాయి. వీటికి కావలసిన నీటి వసతి లేకపోవడం వల్ల కోతులు నీళ్ల కోసం తల్లాడుతున్నాయి. 70 శాతం కోతులు గ్రామాల మీద పడి ప్రజల్ని ఇబ్బందుల పాలిచ్చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. పల్లెలు విడిచి పట్టణాలకు కూడా కోతులు తరలి వెళ్తున్నాయి. ఈ కోతుల వల్ల ఇంట్లో వస్తువులు, పిల్లలకు గాయాలు చేస్తున్నాయి. కూతురు వల్ల ప్రమాదం పరిచోట్ల చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలంటూ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.