

మనన్యూస్,పినపాక,నియోజకవర్గం:గత పది సంవత్సరాల పరిపాలనలో బిఆర్ఎస్ పార్టీ అన్ని రకాల వ్యవస్థలను సర్వనాశనం చేసిందని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం విమర్శించారు. ముఖ్యంగా ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసారని, ఫలితంగా వైద్యఆరోగ్యాన్ని కేసీఆర్ బ్రష్టు పట్టించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సంస్కరణ దిశగా ముందుకు సాగుతుందని, ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మణుగూరు ఏరియా ఆసుపత్రిలో గల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, స్పందించిన రేవంత్ రెడ్డి తక్షణమే ఏడుగురు వైద్య సిబ్బందిని మణుగూరు ఆసుపత్రికి నియమించడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, నియోజకవర్గ ప్రజలందరూ మణుగూరు ఏరియా ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకోవాలని కోరారు. ఆస్పత్రిలో వైద్యుల నియామకం కోసం అపర భగీరధుల్లా కృషిచేసిన పాయం వెంకటేశ్వర్లుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ భషీరుద్దీన్, మదర్ సాహెబ్,బోడ లక్ష్మణరావు, గొగ్గల గేదరాజు,పాయం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
