

ఐ టీ డీ ఏ పిఓ రాహుల్ కి వినతి పత్రం అందజేసిన సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి
మనన్యూస్,పినపాక:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో అనుమతులు లేకుండా మణుగూరు మండలం లో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు , గిరి గిరి వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు,ఫైనాన్స్ కంపెనీలు నిర్వహిస్తున్నారని, అటువంటి వాడిపే తక్షణమే చర్యలు తీసుకోవాలని భద్రాచలం ఐటీడిఎ పిఓ రాహుల్ కు… మణుగూరుకు చెందిన సామాజిక కార్యకర్త , లాయర్ కర్నె రవి సోమవారం ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కర్నే రవి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పుట్టగొడుగుల్లాగా కొన్ని ప్రయివేటు బ్యాంకులు వెలుస్తున్నాయి, గిరి గిరి వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు,మహేంద్ర ఫైనాన్స్ ఇలా రకాల యాజమాన్యాలు పేద ప్రజలను మధ్య తరగతుల బలహీనతలు ఆశ్రయగా చేసుకొని.. వారికి లోన్లు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని పివో రాహుల్ దృష్టికి తీసుకొని వెళ్లారు. ఫలితంగా ఎందరో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని, మహిళలు వారి తాళిబొట్లు అమ్ముకుంటున్నారని, వడ్డీలు కట్టలేక ఇల్లు భూములు ఇలా పలు రకాల స్థిర చరస్తులు అమ్ముకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఏజెన్సీలో జరిగే ఈ అక్రమ ఫైనాన్స్ లు అనుమతులు లేని బ్యాంకులను తక్షణమే సీజ్ చేయాలని, వాటి యాజమాన్యాలపై చట్టారిత్ర కఠిన చర్యలు తీసుకోవాలని కర్నె రవి కోరారు.
