టిడిపి ప్రభుత్వం చెబుతున్న అబద్దాలు, చేస్తున్న మోసాలను ఆదారాలతో సహా వివరించిన వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,నెల్లూరు:వైసీపీ సిటీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రజలకు టీడీపీ చెబుతున్న అబద్దాలను వివరించారు…. శాసనమండలి సాక్షిగా టిడిపి నేతలు.. చెప్పిన అవాస్తవాలపై చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ………భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వము విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న వైస్ ఛాన్స్లర్లను భయపెట్టి బెదిరించి.. దుర్మార్గంగా రాజీనామా చేయించి తొలగించడడం జరగలేదన్నారు.
విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్ల ను తొలగించిన విషయంపై.. తాము ఆధారాలు బయట పెడితే.. జ్యూడిషల్ విచారణకు ఆదేశిస్తామని మంత్రి లోకేష్ చెప్పారని తెలిపారు.తాము ఆధారాలు శాసన మండలికి సమర్పించిన అనంతరం విచారణ జరపకుండా… కుంటి సాకులు చెప్పి లోకేష్ తప్పించుకున్నారని.. ఇది పూర్తిగా శాసనమండలిని అగౌరవపరచడమేనన్నారు.
టిడిపి నేతలు శాసనమండలిని అపహాస్యం చేస్తున్న తీరును ప్రజలంతా చూస్తున్నారని అన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా అవాస్తవాలను మాట్లాడుతుందన్నారు.
2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా ఒక ఏడాది పాటు పూర్తిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ను నిలిపివేస్తే ఆ బకాయిలను వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1880 కోట్ల రూపాయలను ఒక్క రోజులోనే జమ చేశారని తెలిపారు.
అప్పటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తూ వస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనన్నారు. 2023-24 కు సంబంధించి మూడు క్వార్టర్స్ 2024-25 ఏడాదికి సంబంధించి మూడు క్వార్టర్స్ ఇలా మొత్తం ఆరు క్వార్టర్స్ అంటే 5252 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను టి డి పి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు.
అలాగే వసతి దీవెనకి సంబంధించి 2 వేల కోట్ల రూపాయలు బకాయిలను టిడిపి ప్రభుత్వం ఇప్పటికే పెండింగ్లో పెట్టిందన్నారు.ఇలా మొత్తం 7400 కోట్ల రూపాయల బకాయిలను టిడిపి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సి ఉందన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రతి విద్యార్థికి క్రమం తప్పకుండా మూడు నెలలకు ఒక్కసారి ఫీజు రీయింబర్స్మెంట్ ను ,సంవత్సరానికి ఒక సారి వసతి దీవెన ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా ..షెడ్యూల్ ప్రకారం విడుదల చేస్తూ వచ్చారని తెలిపారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ బకాయిలన్నీ విడుదల చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాస్తవాలు మాట్లాడుతూ కాలయాపన చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 13 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారని అవాస్తవాలను ప్రచారం చేశారని అన్నారు .
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు ప్రవేశపెట్టి 45 వేల ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేశారని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో సిస్టం, పరిశుభ్రమైన వాష్ రూమ్స్, గ్రీన్ చాక్ బోర్డ్స్, ఐ ఎఫ్ పి ప్యానల్ బోర్డ్స్, అమ్మ ఒడి, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద పథకాలను తీసుకువచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు సమకూర్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని దీంతో ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం పెరిగిందే తప్ప డ్రాప్ ఔట్స్ అనేది ఎక్కడా లేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా వ్యవస్థని భారత దేశంలోనే.. ఒక ఆదర్శవంతమైన విద్యా వ్యవస్థగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారని చెప్పారు.
కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అప్పటివరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పి ఇప్పుడు వారిని నిలువునా దగా చేసిందన్నారు.ఉద్యోగాలు కల్పించడం పోయి.. ఉన్న 2.30 లక్షల వాలంటీర్ ఉద్యోగాలను తొలగించారని ఆరోపించారు.
పూర్తిగా ఆప్కాస్ వ్యవస్థను రద్దుచేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రైవేట్ దళారీల చేతిలో పెట్టి రోడ్డుపాలు చేశారని అన్నారు.అంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 34,108 ఉద్యోగాలు కల్పిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల 93 వేల ఉద్యోగాలు కల్పించిందన్నారు.భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయలేదన్నారు.
అది వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సాధ్యపడింది అన్నారు.కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ అని నిరుద్యోగులు మోసం చేసిందన్నారు.ఇంతవరకు మెగా డిఎస్సి కి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని అసలు ఇస్తారా ఇవ్వరా అన్న సందిగ్ధంలో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ డీఎస్సీ పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు టీచర్ పోస్టులు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వారందరికీ 14,264 మందికి టీచర్ పోస్టులు ఇచ్చారని తెలిపారు. ప్రజలను,మభ్యపెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద అవాస్తవాలు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందన్నారు.
వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు మూలంగా ఈరోజు సొసైటీ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.
ఇక పరిశ్రమల విషయానికొస్తే గత టిడిపి ప్రభుత్వంలో 14 వేల 787 ఎకరాలను పరిశ్రమల కోసం కేటాయిస్తే.. కేవలం 2,516 యూనిట్లు మాత్రమే కార్యరూపం దాల్చాయని.. 66,683 కోట్ల పెట్టుబడులు.. గ్రౌండ్ లెవెల్ కి వచ్చాయన్నారు.అదే వైసిపి గవర్నమెంట్ లో కేవలం 6450 ఎకరాల్లో 3780 యూనిట్స్ నెలకొల్పామని..84,873 కోట్ల రూపాయలను గ్రౌండింగ్ చేసుకున్నామని తెలిపారు.
చంద్రబాబు గవర్నమెంట్ లో పారిశ్రామికంగా రాష్ట్రం 22 ర్యాంకులో ఉంటే వైసీపీ ప్రభుత్వంలో 3 ర్యాంకు సాధించుకున్నామన్నారు.
తెలుగుదేశం పార్టీ పి4 మోడల్ తీసుకొచ్చి… పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లో వెళ్తుందన్నారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి 17 నూతన మెడికల్ కళాశాలను తీసుకొచ్చారని వాటన్నిటినీ ఈరోజు కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ లోకి తీసుకెళ్తుంది అన్నారు.ఇలా రోడ్స్, పోర్టులతో సహా మొత్తం .. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లోకి తీసుకువెళ్లి.. ప్రజలకు ఆ ఫలాలు అందకుండా టి డి పి ప్రభుత్వం చేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో సేవలందించాలి అనే దృక్పథంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకొస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వాటన్నిటిని నిర్వీర్యం చేసే పనిలో ఉందన్నారు.తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని.. అవాస్తవాలు ప్రచారం చేశారని అన్నారు.
శాసనమండలిలో దీనిపై వివరాలు సేకరిస్తే.. తెలిసింది కేవలం వైసీపీ ప్రభుత్వంలో 4 లక్షల 50 వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేశారని తెలిపారు.
అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం నాలుగు లక్షల 50 వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారని తెలిపారు.అయితే టిడిపి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు 44 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని తెలిపారు.
మళ్లీ ఈ ఏడాది లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసేందుకు టిడిపి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ఏ పథకాలు అమలు చేయకుండానే టిడిపి ప్రభుత్వం ఇలా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడంపై ప్రజలు అసహనం.. వ్యక్తం చేస్తున్నారని అన్నారు.తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని.
మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మళ్ళి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

  • Related Posts

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    మన న్యూస్, కావలి,ఏప్రిల్ 24 :– మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ…

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మన న్యూస్,కావలి, ఏప్రిల్ 24:-*కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా ఎస్పీ.*కుటుంబానికి అండగా ఉంటామని హామీ.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య,పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

    విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు