

మనన్యూస్,గొల్లప్రోలు:జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.ఆదివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బలమైన కార్యకర్తలు గల పార్టీ జనసేన పార్టీ అని పేర్కొన్నారు.ప్రతి కార్యకర్త కష్టం జనసేన పార్టీ అన్నారు.మేమంతా అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల తో పనిచేయడం వల్ల రాష్ట్రంలో బలమైన పార్టీగా మారిందని ఓదూరి నాగేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు.అలాగే వీర మహిళలు, వాలంటరీ గా పని చేసిన వారు కృషి, పట్టుదల ఎంత ఐనా ఉందని వీరందరూ వల్ల ఆవిర్భావ సభ విజయవంతం అయ్యినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
