మనన్యూస్,వింజమూరు:పట్టణంలోని ప్రసన్న రెడ్డి నగర్ లో వేంచేసి యున్న శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆలయ కమిటీ సారథ్యంలో శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి గుంటూరు వారిచే నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ప్రారంభించారు. ముందుగా హరిహర పుత్ర అయ్యప్ప స్వామికి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైద్య శిబిరాన్ని ప్రారంభించి, కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం ఆలయ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *