

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు నీడ,నీరు లేకపోవడంతో కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అప్పట్లో ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఒక గ్రూపు చొప్పున పాల్తిన్ కవర్ రూపంలో టెంట్ ను ఇచ్చేవారు.గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కూలీలకు కనీస నీడ,నీటి సౌకర్యం ఇవ్వకపోవడంతో ఉపాధి హామీ కూలీలు ఇంటి నుంచి వచ్చేటప్పుడు నీళ్ల బాటిల్ తీసుకువచ్చి పనిచేసిన అనంతరం నీరు తాగుతున్నారు.కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోని సర్పోని చెరువులో జాతీయ ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి.నీడ లేకపోవడంతో కూలీలు కర్రలు,పొరుకతో మండపంలా తయారు చేసుకుని కూలీలు సేద తీరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కూలీలకు కనీస నీడ,నీరు,గడ్డపారలు పారలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూలీలు కొరుతున్నారు.

