అత్యంత హానికరమైన విధానాలను అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు

విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం తలపెట్టిన ప్రజా పోరు

పాచిపెంట నవంబర్11( మన న్యూస్ ):=

పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కార్యక్రమం విజయవంతం ప్రతి ఒక్కరూ కదలి రావాలని సిపిఎం పార్టీ ఇంటింటికి ప్రచారం చేస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ వాళ్లు పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈతమానువలస గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మండల నాయకులు మంచాల శ్రీనివాసరావు లావుడు జెన్ని గౌరమ్మ ప్రజా సంఘాల నాయకులుగౌరునాఇడు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి అంబానీ అదాని కార్పొరేట్లు సేవలో మునిగిపోయిన మోడీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు కదలాలని అన్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే నాయకుడు అనే జమిలి ఎన్నికలు పద్ధతుల్ని తీసుకురావడం రాజ్యాంగానికి విరుద్ధమని దీనిని ప్రజలంతా వ్యతిరేకిస్తున్న మోడీ ఏకపక్షంగా వివరించడం దుర్మార్గమని అన్నారు జాతీయ ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఒకపక్క నిత్యవసర వస్తువులు ధరలు పెరిగిపోయి నిరుద్యోగం పెరిగిపోయి రైతాంగానికి గిట్టుబాటులేక వ్యవసాయరంగా వదిలి వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని ధరలు అదుపు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని సామాన్య ప్రజలు బతకడం చాలా కష్టంగా ఉందని అన్నారు మహిళలపై చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని దీనిపై చట్టాలు కఠినంగా తీసుకోకపోవడం వలన మహిళలకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అమలు చేసి ఇచ్చిన హామీ అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని అన్నారు. స్మార్ట్ మీటర్లు పేరుతో కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై మరింత భారాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు పై సమస్యలు పరిష్కారం కోసం ప్రజలంతా కదిలి రావాలని ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాచి పెంట మండలం ఈత మానవలస మెట్టవలస అమ్మ వలసి పెద్దవలస పద్మాపురం కర్రివలస తదితర గ్రామాలలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేయడం జరిగింది 14న జరిగిన కార్యక్రమం జయప్రదం చేయాలని భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం నాయకుడు కోరాడ ఈశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజలు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!