పాచిపెంట, నవంబర్11( మన న్యూస్):-
కూరగాయలు,ఆకుకూరలు,చిరుధాన్యాలు దేశి వరి బియ్యం రకాలతో కూడిన ఎలాంటి రసాయనాలు లేకుండా పండించిన స్వచ్ఛమైన ప్రకృతి సేద్య స్టాల్ ప్రతి సోమవారం పాచిపెంట వ్యవసాయ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయబడుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతిలో తెలిపారు. ఆయన సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.దేశి వరి బియ్యం అత్యంత పోషక విలువలతో కూడుకున్నదని వీటిలో నల్ల బియ్యం,ఎర్ర బియ్యం అంటే అనేక ఇతర రకాలు ఉన్నాయని వీటిని మధుమేహం మోకాళ్ళ నొప్పులు వంటి వ్యాధులు ఉన్నవారు తీసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని అలాగే ప్రాసెస్ చేసిన చిరుధాన్యాలు కూడా స్టాల్లో విక్రయించబడతాయని ఆరోగ్యవంతమైన జీవనానికి ఇది ఎంతగానో తోటపడుతుందని అలాగే మొదటగా తక్కువ మొత్తంతో ప్రారంభించి ప్రకృతి సేద్య రైతుల సంఖ్యను పెంచి దీనిని మరింత విస్తృపరచాల్సిన అవకాశం అవసరం ఉందని తెలిపారు. కావున అందరూ ఈ స్టాల్ ను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *