తమపై దాడి చేసిన గ్రామ మాజీ వాలంటీర్ కుటుంబ సభ్యులపై చర్య తీసుకోండి – జిల్లా కలెక్టర్ కు బాధిత కుటుంబ సభ్యుల వినతి

మన న్యూస్, చిత్తూరు, ఫిబ్రవరి 24 : ప్రభుత్వ భూమిని ఆక్రమించడాన్ని ప్రశ్నించిన తమపై దాడి చేసి గాయపరిచిన గ్రామ మాజీ వాలంటీర్ సరిత, ఆమె భర్త, రామకృష్ణారెడ్డితో పాటు, వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకొని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వెదురుకుప్పం మండలం మాకంబాపురంకు చెందిన బాధితులు ప్రహ్లాదరెడ్డి, చెంగల్ పండు రెడ్డి, వారి కుటుంబ సభ్యులు తదితరులు సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ … మాకంబాపురంలోని మాజీ వాలంటీర్ సరిత, ఆమె భర్త రామకృష్ణారెడ్డి గ్రామ శివారులోని చౌటుచెరువుకు ఆనుకొని సర్వే నంబర్ 177 – 3 కు సంబంధించిన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని సరిత, ఆమె కుటుంబ సభ్యులు ఆక్రమించుకుని, తమ పొలాలకు దారి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై గతంలో కలెక్టర్, ఆర్డీవోలకు తామ చేసిన ఫిర్యాదు మేరకు ఆర్టీవో అందించి సంబంధిత ప్రభుత్వ భూమిని పరిశీలించి ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు, తమ పొలాలకు దారి సౌకర్యం కల్పించాలని తెలిపారు. అయితే రెండేళ్ల అనంతరం తిరిగి సరిత, ఆమె భర్త రామకృష్ణారెడ్డి ఈనెల 22వ తేదీన తమ పొలంలో కోళ్ల ఫారం నిర్మిస్తున్న ప్రహ్లాదరెడ్డిపై మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి కబ్జాను ప్రశ్నిస్తున్న తమను అంతమొందించేందుకే దాడికి పాల్పడ్డారని తెలిపారు. దాడి విషయాన్ని అదే రోజు సాయంత్రం ఫిర్యాదు చేసినా వెదురుకుప్పం మండల పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. పట్టించుకోకపోగా తమపై దాడి చేసి గాయపరిచిన వారు ఇచ్చిన ఫిర్యాదును మాత్రం వెదురుకుప్పం పోలీసులు స్వీకరించారన్నారు. అదే విధంగా సరిత సమీప బంధువైన ఆర్మీ జవాన్ జగదీశ్వరరెడ్డి తనకు భారత ఆర్మీ ఇచ్చిన తుపాకిలోని తూటాలనులను ఫోటో తీసి తమ వాట్సాప్ నంబర్లకు పంపుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. తమకు వ్యవసాయం తప్ప వేరే వృత్తి తెలియదని, ఈ క్రమంలో తమ పొలాలకు దారి లేకుండా అడ్డుకుంటున్న సరిత, ఆమె కుటుంబ సభ్యులైన రామకృష్ణారెడ్డి, మార్కొండ రెడ్డి, ఆదిలక్ష్మి, జమున తదితరులపై చర్య తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, వారి బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ‎తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13‎పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ…

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    • By JALAIAH
    • September 14, 2025
    • 3 views
    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    • By JALAIAH
    • September 14, 2025
    • 5 views
    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి