

మనన్యూస్,నారాయణ పేట:మెట్రో గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం సఫాబేతుల్ మాల్ మరియు రహ్ బర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 50 పుష్కల బండ్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజర్ మహమూద్ ఇక్తాషాముద్దీన్ మాట్లాడుతూ,సమాజంలోని అర్హులైన వారికి గౌరవప్రదమైన ఉపాధి అందించడంతోపాటు,వారికి ఆర్థికంగా స్వతంత్రంగా మార్చడం ఈ ఫౌండేషన్ యొక్క ప్రధాన లక్ష్మమని అన్నారు.సుమారు 8 లక్షల రూపాయల విలువైన 50 పుష్కల బండ్లను పంపిణీ చేసామని,ఇందులో 35 పండ్ల బండ్లు 15 కూరగాయల బండ్లు ఉన్నాయని తెలిపారు.నారాయణపేటకు చెందిన సఫాబేతుల్ మాల్ మరియు రహ్ బర్ ఫౌండేషన్ ప్రతినిధుల సేవలను పలువురు అభినందించి వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా బాధ్యత గలవారు అర్హులైన వారు అందుకున్న ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ జాఫర్ చాంద్,మహమ్మద్ తఖీ, అబ్దుల్ రహిమాన్,ఫారోబిన్,ముఖషిన్,సయ్యద్ ఫయాజ్,ఎండి హమీద్,
