

మనన్యూస్,నారాయణ పేట:మాగనూరు మండల పరిధిలోని అమ్మపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ బీర లింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.వేద పండితులు మంత్రోచ్ఛారణతో విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.అమ్మపల్లి మాజీ సర్పంచ్ జీ రవీందర్ హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు జగదీష్,సత్యనారాయణ శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కృష్ణ, ఆది,రమేష్ రామప్ప,బలగారి శీను బలరాజు,పెద్ద తిమ్మప్ప,పోగుల శివప్ప,చిన్న వెంకటేష్,శివలింగప్ప, చిన్న సాబన్న, నర్సింహులు,ఆనంద్ జానప్ప,ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.