శ్రీవారి భక్తుల సేవలో తరిస్తున్న నాయి బ్రాహ్మణులు

టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదు

ఉద్యోగుల సంక్షేమం కోసమే పరితప్పిస్తున్న బోర్డు మెంబర్ నరేష్ కుమార్..

వంకిపురం పవన్ ను తమ కులం నుండి ఎప్పుడో వెలివేశాం.నాయి బ్రాహ్మణ కుల సంఘ నేతలు

మనన్యూస్,తిరుపతి:దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం నాయి బ్రాహ్మణులుగా భక్తి భావంతో ఈ రోజు వరకు ఎటువంటి మచ్చ లేకుండా తమ వంతు సేవ చేస్తున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు ఆవుల పార్టీ బుజ్జిబాబు పేర్కొన్నారు.ఈ క్రమంలో బుధవారం తిరుమల ముఖద్వారం వద్ద జరిగిన ఘటనపై టిటిడి ఉద్యోగులు తమ కులానికి చెందిన టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిరసనలకు పాల్పడటం బాధాకరంగా ఉన్నదని విచారణ వ్యక్తం చేశారు.శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తమ సంఘ నాయకులతో కలిసి మాట్లాడారు.టీటీడీ దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన ఇచ్చిన హామీ మేరకు బీసీ నాయి బ్రాహ్మణ కులానికి చెందిన కుప్పం నివాసి అయిన వైద్యం శాంతారావుకి,అలాగే కర్ణాటక రాష్ట్రానికి చెందినమరో నాయి బ్రాహ్మణులు నరేష్ కుమార్ కి టిటిడి పాలకమండలి సభ్యులు గా ఇచ్చినందుకు వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని వర్షం వ్యక్తం చేశారు.ఈమధ్య తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న కొత్త నిర్ణయాల వల్ల ఉద్యోగులు తమదైన శైలిలో భక్తులకు,విఐపి లకు తేడా లేకుండా వారికి నచ్చిన రీతిలో వారు విధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు.బుధవారం జరిగిన టిటిడి పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి దానికి పది నిమిషాల ముందు మహా ద్వారం గుండా ఎవరెవరు వెళ్లారు.అనే ఎక్కడా సిసి టీవీ ఫుటేజ్ బయట పెట్టలేదన్నారు.బోర్డు సభ్యులుగా వారికి మహా ద్వారం గుండా పోయే అవకాశం ఉన్న,కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా బోర్డు మెంబర్ మహా ద్వారం గుండా వెలుపలికి వచ్చే సమయంలో టిటిడి ఉద్యోగి అవగాహన రాహిత్యంగా వ్యవహరించడం సబబుగా లేదన్నారు.తరతరాలుగా నాయి బ్రాహ్మణులుగా మంచి కట్టు,సాంప్రదాయంతో భగవంతుడు సేవలో తాము కూడా శాశ్వత,కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఇతర ఉద్యోగస్తులతోపాటు సమైక్యంగా పనిచేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో నిరంతరం ఉంటున్నామని గుర్తు చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మా సేవలను గుర్తించి టీటీడీ బోర్డు మెంబర్ గా మా కులానికి సంబంధించిన ఇద్దరిని నియమించి రాష్ట్రవ్యాప్తంగా కళ్యాణకట్టలో పనిచేస్తున్న మా సమస్యలను గుర్తించి వాటిని నిషేధిస్తున్న ఈ తరుణంలో మాపై ఇటువంటి వివక్ష చూపడం బాధ కలిగించిందన్నారు.తాము నిజంగానే టీటీడీ ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన బోర్డు మెంబర్ నరేష్ కుమార్ భాష బేధం వల్ల జరిగిన తప్పిదానికి,దానికి ముందు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ ను రిలీజ్ చేసి ఎంతమంది ఆ రోజు ముఖద్వారం ముందు బయటకు ప్రవేశించారన్న వీడియోను టీటీడీ యాజమాన్యం విడుదల చేయాలని కోరారు.నారీశక్తి అవార్డు గ్రహీత,శ్రీవారి కళ్యాణకట్ట మహిళా క్షురకుల వ్యవస్థాపక అధ్యక్షురాలు కె.రాధాదేవి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాల పట్ల తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని,ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలోకి వస్తున్న తమ తరతరాల ప్రవృత్తి దారులను గుర్తిస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమకు పదవులు ముట్ట చెప్పడం ఆనందదాయకంగా ఉందన్నారు.టీటీడీ లో చిరు ఉద్యోగిగా ఉన్న చీర్ల కిరణ్ అనే వ్యక్తి టిటిడి ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ గత టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కనుసనల్లో పనిచేస్తుండేవారు అనే ఆరోపణలు ఎక్కువగా ఉండేవన్నారు.వైసిపి ప్రభుత్వ హయాంలో ఈయన టిటిడిలో విధులు నిర్వహించకుండా చిరుద్యోగి అయినప్పటికీ అధికారి స్థాయిలో సిబ్బందిపై హుకుం జారీ చేసేవాడని ఆరోపించారు.ఇప్పుడు కూడా టీటీడీ బోర్డు మెంబర్ పై వచ్చిన ఆరోపణలను ప్రతిపక్ష వైసిపి పార్టీ నేతల కనుసనల్లోనే ఉద్యోగులను రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలు చేపట్టడం దుర్మార్గపు చర్య అని చెప్పారు.అలాగే కళ్యాణ కట్టలో పనిచేస్తున్న వెంకీపురం పవన్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని,ప్రతిపక్ష వైసిపి పార్టీకి చెందిన నేతలతో తిరుగుతూ కళ్యాణకట్ట విధులు నిర్వహించకుండా ఉద్యోగ సంఘ నేతగా చలామణి అవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.ఇప్పటికే తమ నాయి బ్రాహ్మణ కులం నుంచి వంకిపురం పవన్ ను బహిష్కరించడం జరిగిందన్నారు.ప్రతిపక్ష వైసిపి పార్టీ నేతల కనుషనల్లోనే కొంతమంది టీటీడీ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమాలు చేశారని కొంతమంది ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకుంటూన్నా రని, పేర్కొన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు చీర్ల కిరణ్, వంకి పురం పవన్ కార్యకలాపాలపై టీటీడీ ఉన్నతాధికారులు,విజిలెన్స్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టిటిడి పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ మాటలను వ్యంగంగా చిత్రీకరిస్తూ టిటిడి ఉద్యోగులు నిరసనలు,ధర్నాలు చేయడం సబబుగా లేదని ఖండించారు.టిటిడి దేవస్థానం వారు సోషల్ మీడియాలో విడుదలైన వీడియోకు ముందు జరిగిన ముఖద్వార ప్రవేశ,బయటకు వచ్చిన వీడియోను కచ్చితంగా విడుదల చేయాలని కరాకండిగా తేల్చి చెప్పారు.ఈ విలేకరుల సమావేశంలో నాయి బ్రాహ్మణ సంఘ నేతలు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..