

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ జన సమితి బలపరిచిన పన్నాల గోపాల్ రెడ్డిని,ఉపాధ్యాయులందరూ ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ జన సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు బత్తుల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు బుధవారం ఆయన పన్నాల గోపాల్ రెడ్డి విజయాన్ని కోరుతూ పాల్వంచలోని పలు పాఠశాలల్లో ప్రచారాన్ని నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గోపాల్ రెడ్డి ఒక ఉపాధ్యాయునిగా ఆయన జీవితాంతం ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని,పాఠశాలలో పేర్కొన్న పలు సమస్యలపై,అదేవిధంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలపై నిత్య పోరాటం చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లారన్నారు.ఎంతో అనుభవం ఉన్న గోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించి,చట్టసభలకు పంపించాల్సిన అవసరం ఉందని తద్వారా ఉపాధ్యాయ సమస్యల పరిష్కార గొంతుగా ఆయన పని చేస్తారని అన్నారు.మూడు ఉమ్మడి జిల్లాల్లోని ఉపాధ్యాయులందరూ గోపాల్ రెడ్డికి ఓట్లు వేసి, ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు.