250 మంది గిరిజన రోగులుకు వైద్య సేవలు
సామాజిక కార్యక్రమాలుతో సత్సంబంధాలు మెరుగు
సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ.
మనన్యూస్,పాచిపెంట:సుదూర ప్రాంతాలలో ఎత్తయిన కొండలు పై జీవనం గడుపుతున్న గిరిజన ప్రజలకు పోలీసులు అందించిన వైద్య సేవలు విజయవంతంగా ముగుసాయి.బుధవారం నాడు పాచిపెంట ఎస్ ఐ వెంకట సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపుకు అనూహ్యస్పందన లభించింది.దూర ప్రాంతాల నుంచి గిరిజన రోగులు హాజరై రకరకాల వ్యాధులకు వైద్యం చేయించుకున్నారు.శ్రీకాకుళం పట్టణానికి చెందిన జెమ్స్ హాస్పిటల్యా జమాన్యం సౌజన్యంతో పలు వ్యాదులకు సంబందించిన పలువురు డాక్టర్లు హాజరై వైద్య సేవలు అందించారు.250 మంది కి సేవలు అందించారు.ఇటువంటి మెగా వైద్య శిబిరాలతో పోలీసులు ప్రజలకు చేరువై సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి వీలుగా ఉంటుందని,వారిలో మార్పు రావడానికి అవకాశం ఉంటుందని సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.సుదూర ప్రాంతాల నుంచి మెగా వైద్య శిబిరానికి 250 మంది వైద్య సేవ నిమిత్తం హాజరు కావడం గొప్ప విశేషమని పేర్కొన్నారు.గిరిజనులు స్పందన రావడం ఇటువంటివి సామాజిక కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయడం చాలా మంచి విషయమని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.పాచిపెంట ఎస్సై వెంకటసురేషు సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.దూర ప్రాంతాల నుంచి గిరిజన రోగులను వైద్య శిబిరానికి తీసుకురావడం మరల వారిని తిరిగి క్షేమంగా ఇంటికి చేర్చడంతో గిరిజన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు.పలు రకాల రకాల రోగాలు కు వైద్యం చేయించుకున్న వారిలో కొంతమంది దీర్ఘకాలిక రోగులను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని జిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం పేర్కొన్నారు.వైద్య శిబిరానికి హాజరైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.పోలీసులు అందించిన సేవలకు రోగులు ఆనందం వ్యక్తం చేశారు.వాలీబాల్ కిట్లు పంపిణీ యువతకు ప్రోత్సాహం నింపడానికి పాచిపెంట పోలీసులు వారికి వాలీబాల్ కిట్లు ఈ సందర్భంగా పంపిణీ చేశారు.మండలంలో గరేళ్లవలస,సరాయివలస,చీపురు వలస,వేటగాని వలస,తదితర గ్రామాల యువతకు సీఐ రామకృష్ణ చేతులు మీదుగా వాలీబాల్ కిట్లు అందజేసి త్వరలో సాలూరు రూరల్ ప్రాంతం లో జరగనున్న మెగా వాలీబాల్ టోర్నమెంట్ కు అందరూ శారీరకంగా సిద్ధం కావాలని మంచి ఆటలు కనబరచాలని,ప్రతిభ కనబరిచి కప్పు తేవాలని ఆయన ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు.యువతకు ప్రోత్సాహం ఇచ్చి వారి కి వెన్నుదన్నుగా ఉన్న ఎస్సై వెంకట సురేష్ కు పలువురు గిరిజన యువకులు కృతజ్ఞతలు తెలిపారు.
