

మనన్యూస్,కామారెడ్డి:నిషేధిత గంజాయి రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రూరల్ సిఐ రామన్,దేవునిపల్లి ఎస్సై రాజు,సిబ్బందితో కలిసి మధ్యాహ్న సమయంలో బైపాస్ వద్ద నిజామాబాద్ నుండి కామారెడ్డికి వస్తున్న వాహనాలను తనిఖీలు నిర్వహించగా వాహనాల తనిఖీలో భాగంగా కారు లో మోటార్ సైకిల్ పై నిషేధిత గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకొని తనిఖీలు నిర్వహించగా వారి వద్ద నుండి సుమారు 445 గ్రాముల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకొని వారి వద్ద నుండి ఒక కారు,మరియు మోటారు సైకిల్,నాలుగు మొబైల్ ఫోన్స్, స్వాధీనపర్చుకొని వారిని రిమాండ్ కి తరలించడం జరిగిందని రూరల్ సీఐ రామన్,వెల్లడించారు ఇట్టి కేసును చాక చైఖ్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన కామారెడ్డి రూరల్ సీ.ఐ.రామన్,దేవునిపల్లి ఎస్సై రాజు,క్రైమ్ టీం సిబ్బంది రవికిరణ్,రామస్వామి,బాలకృష్ణ,రాజులను కామారెడ్డి సబ్ డివిజనల్ అధికారి చైతన్య రెడ్డి,జిల్లా ఎస్పీ సింధూ శర్మ అభినందించారు.