


మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని బ్లూ బెల్స్ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు విద్యార్థులు గేటు నుంచి స్వాగతం పలుకుతూ మార్చి ఫస్ట్ నిర్వహిస్తూ పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.అనంతరం పలు రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించి ముందంజలో ఉండాలని అన్నారు. చదువుతోపాటు క్రీడలు వ్యాసరచన పోటీలలో కూడా విద్యార్థులు చెరుకుగా పాల్గొని ముందుకు ఎదగాలని అన్నారు. బ్లూ బెల్స్ పాఠశాల కరస్పాండెంట్ సంజీవరెడ్డి ఎమ్మెల్యేకు జ్ఞాపిక అందజేసి శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామ్ రెడ్డి,వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి,నాయకులు హన్మంలు, మోహన్ రెడ్డి, సాయి రెడ్డి,తదితరులు ఉన్నారు.



