

_ గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం
_ పల్లెల్లో కక్ష్యలు ప్రోత్సహిస్తే క్రిమినల్ కేసులు
_ మదనపల్లె రూరల్ సీఐ సత్యనారాయణ
మనన్యూస్,మదనపల్లె:ద్వివాహన దారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాల నడిపే వారందరూ సీటు బెల్ట్ పెట్టుకుని సురక్షితమైన ప్రమాణం చేస్తూ.ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు.ఇటీవల ఏసీబీకి పట్టుబడిన రామసముద్రం ఎస్ఐ వెంకటసుబ్బయ్య, రూరల్ సీఐ రమేష్‌లను అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా స్పెషల్‌బ్రాంచ్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణను మదనపల్లె రూరల్ సీఐగా నియమించడంతో శుక్రవారం ఆయన బాధ్యత స్వీకరించి మీడియాతో మాట్లాడారు.జిల్లా ఎస్పీ, మదనపల్లె డీఎస్పీ ఆదేశాల మేరకు ముదివేడు,రామసముద్రం,నిమ్మనపల్లె మండలాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని,గంజాయి వినియోగించిన,అమ్మినా పల్లెల్లో పాత కక్ష్యలతో గొడవల చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరికలు చేశారు.ఎవరైనా ముదివేడు, నిమ్మనపల్లె,రామసముద్రం మండలా పరిధిలో గంజాయిపై సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకుంటామని,వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.సమస్యలపై మూడు మండలాల ప్రజలు,మహిళలు,యువకులు,రైతులు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదులు చేయవచ్చు అన్నారు.