

మనన్యూస్,తిరుపతి:తిరుపతిలో ఎన్నడూ లేనివిధంగా దౌర్జన్యాలు,అక్రమ అరెస్టులు చేయించి పోలీసులతో ఎన్నికలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి,ఆయన కుమారుడు భూమన అభినయ రెడ్డిలు ప్రశాంతత గురించి,ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ అన్నారు.శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.భువన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండే సమయంలో తిరుపతిలో ఏ ఎన్నికలైనా ప్రశాంత వాతావరణంలో జరిపారా ఒక్కసారి ఆత్మసాక్షిగా పరీక్షించుకోవాలన్నారు.టౌన్ బ్యాంక్ ఎన్నికలు,నగరపాలక సంస్థ ఎన్నికలు,ఎంపీ ఎన్నికలు అన్ని అరాచకంతో జరగడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి అభ్యర్థి అయిన తనకు ఓటు వేసినారని వైసిపి కార్పొరేటర్ ఇంటికి గుండాలను పంపి టౌన్ బ్యాంకుకు డబ్బులు కట్టాలని డిమాండ్ చేయడం వాస్తవం కాదా అన్నారు.సీనియర్ టిడిపి నాయకుడైన మబ్బు దేవనారాయణరెడ్డి ఇంటికి అర్ధరాత్రి వెళ్లి డ్రోన్ కెమెరాలు ఎగరేయడం దీనికి సంకేతం అన్నారు.మేయర్ కు గాని,కార్పొరేటర్లకు గాని ఏనాడు విలువ ఇవ్వకుండా,వారితో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించకుండా వారిని హీనంగా చూసినందుకు అసంతృప్తితో డిప్యూటీ మేయర్ ఎన్నికలో వైసిపి అభ్యర్థికి కాకుండా కూటమి అభ్యర్థికి ఓట్లు వేశారని స్పష్టం చేశారు.తిరుపతిని ప్రశాంత వాతావరణంలో ఉంచడానికి రాజకీయాలు రాజకీయాలుగానే ఉండాలని,వ్యక్తిగత విమర్శలు చేయొద్దని,భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం రాజకీయాలకు స్వస్తి పలకాలని కూటమి ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.ఈ విలేకరుల సమావేశంలో శీను యాదవ్ శీను యాదవ్,శ్రీధర్,జగన్నాథం,చంద్రశేఖర్ రెడ్డి,రవి,బాలాజీ,మణినాయుడు పాల్గొన్నారు.