

- కొహెడా మార్కెట్ కు అంతర్జాతీయ గుర్తింపు**రైతుల ముసుగులో ఉద్యోగుల పై దాడి నీ ఖండిస్తున్నాం.
- రింగురోడ్డును తాకట్టు పెట్టిన ఘనత గత ప్రభుత్వానిది: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఎల్బీనగర్ . మన న్యూస్:- తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిన గత ప్రభుత్వ నాయకులు దొంగే దొంగ అంటూ మరోసారి విధ్వంసానికి దిగుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఉద్యోగుల సంఘం సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీ ని బుధవారం మహేశ్వరం నియోజకవర్గ ఆర్కే పురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లోని వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉద్యోగుల సంఘం సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు చిలుక నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డైరీ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు రెండువేల కోట్ల నుండి 3000 కోట్ల వరకు కోహెడ మార్కెట్ ను నిర్మించబోతున్నామని తెలిపారు. రాజకీయపరమైన అంశంతో ఉన్నవారే ఉద్యోగులపై దాడికి దిగుతున్నారని అన్నారు. ప్రజలకు అన్నం పెట్టే ఏ ఒక్క రైతు కూడా దాడులకు పాల్పడడని కడుపు మార్చుకొని అన్నం పెట్టే రైతులను బిఆర్ఎస్ నాయకులు వీధిలోకి తీసుకు వస్తున్నారని అన్నారు. అధికారంలో ఉంటే ఒకలాగా అధికారం కోల్పోతే మరో రకంగా టిఆర్ఎస్ నాయకులు వ్యవహరించారని మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టిన ఘనత గత ప్రభుత్వాన్నిదని అన్నారు. ఉద్యోగులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని అన్నారు. పది సంవత్సరాలు రైతులను హరిగోశపెట్టిన నాయకులు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని వారిని రైతులు దూరం పెట్టిన సిగ్గు తెచ్చుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు భరోసా, రుణమాఫీ చేస్తే దాంతో రైతుల జేబుల్లో డబ్బులు పడితే టిఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అధిగమిస్తూ నిలబడిందన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తాము అండగా నిలుస్తామన్నారు. ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తాను స్వయంగా వచ్చి సమస్యలు వివరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హుస్సేని ముజీబ్, వ్యవసాయ మార్కెట్ శాఖ సంచాలకులు ఉదయ్ కుమార్, లక్ష్మీబాయి, లక్ష్మణుడు, రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణా అభివృద్ధి చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి, చిలుక ఉపేందర్ రెడ్డి, పున్నా గణేష్ , రాష్ట్రంలోని ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు.