

మన న్యూస్,అబ్దుల్లాపూర్మెట్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేకువజామున కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి లాస్య రెడ్డి కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు.ఈ సందర్భంగా చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని…రైతులంతా పాడి పంటలతో వర్ధిల్లాలని వెంకటేశ్వరుడిని కోరుకున్నట్లు తెలిపారు.