

బంగారుపాళ్యం జనవరి 2 మన న్యూస్
పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం లోని తుంబ గ్రామ పంచాయతీలోని ఎస్టీ కాలనీ లో సామాజిక వర్గ ప్రజలకు తుంబ గ్రామం సర్పంచ్ ఉషశ్రీ మురళీమోహన్ మరియు చిత్తూరు జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ రెవెన్యూ సిబ్బంది ద్వారా స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో ముళ్లపదలో నల్ల రాళ్లు గుట్టలు గా ఉన్న భూమిని జెసిబి ద్వారా చదును చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి గ్రామ అభివృద్ధికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు నిధులనుండి 10 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది.తుంబ గ్రామానికి నిధులు రావడానికి కారకులైన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జై ప్రకాష్ నాయుడు గారికి మరియు టిడిపి మండల నాయకులు అందరికి కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్న గ్రామ ప్రజలు.ఈ కార్యక్రమంలో పి ఆర్ .ఏ ఈ కృష్ణ ఉపసర్పంచ్ చిరంజీవి, గురుస్వామి యాదవ్,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.