మన ధ్యాస మక్తల్: నియోజకవర్గ బతుకమ్మ కమిటీ చైర్పర్సన్ గా వాకిటి లలితని,మహిళా సంఘాల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వాకిటి లలిత ను మంత్రి వాకిటి శ్రీహరి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం వాకిటి లలిత మాట్లాడుతూ, బతుకమ్మ కమిటీ చైర్ పర్సన్ గా తనను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. నియోజవర్గ మహిళలు బతుకమ్మ కమిటీ చైర్ పర్సన్ గా తనపై పెద్ద బాధ్యతను ఉంచారని, వచ్చే ఏడాది మరింత ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు .బతుకమ్మ సంబరాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే ప్రతి పల్లె పల్లెనా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మక్తల్ పట్టణంలో రాంలీలా మైదానంలో మాత్రం పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఇది రెండో ఎడాది అని గుర్తు చేశారు. బతుకమ్మ పండగకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *