మన ధ్యాస, మక్తల్: మండల పరిధిలోని కర్ని గ్రామంలో కొంతకాలంగా అంగవైకల్యంతో బాధపడుతున్న రాజు యాదవ్ కు కృత్రిమ కాలు కొరకు పదివేల రూపాయలను సోమవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి తరపున బిజెపి పార్టీ నాయకులు 10 వేల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు మాట్లాడుతూ, రాజు యాదవ్ బాధపడుతున్న విషయాన్ని బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారికి తెలియజేసిన వెంటనే తన వంతు సహాయంగా 10 వేల రూపాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో, భారతీయ జనతా పార్టీ మక్తల్ రూరల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, మక్తల్ రూరల్ కార్యదర్శులు సురేష్, జనార్ధన్, కర్ని గ్రామ భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుడు బి పురుషోత్తం రావు, ఈద కర్రె కిష్టప్ప, కుమ్మరి వెంకటప్ప, వాకిటి హన్మంతు, మేస్త్రి రంగప్ప, వాకిటి అంజప్ప, ఈద రఘు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వివిధ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *