మన ధ్యాస,మక్తల్ : పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఇసుక టిప్పర్ ను మక్తల్ పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.వాహనాల తనిఖీలలో సరైన అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తున్నట్లు గుర్తించడంతో, సదరు టిప్పర్ ను స్వాధీనం చేసుకుని, సంబంధిత నిబంధనల ప్రకారం, మక్తల్ ఎస్ ఐ పి రాజు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పట్టు బడిన టిప్పర్, నంబర్: TS06UE2303ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తవ్వడం, రవాణా చేయడం లేదా అక్రమంగా నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.