రేణిగుంట.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట పట్టణం పాంచాలి వీధి ఓల్డ్ హర్ష జిమ్ లో శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని క్లస్టర్ ఇన్‌చార్జ్ డి.పి. పుష్పనాథం ప్రత్యేకంగా సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన శ్రీ గణేష్ ప్రతిమను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… “తొలిపూజలందుకునే విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రజలందరి జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. సకల విఘ్న నివారిణి అయిన గణపతి దేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలి” అని పేర్కొన్నారు.
అనంతరం మండపం వద్ద భక్తులకు తీర్థప్రసాదాలు మరియు మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత అంతా ఒక్కటై ఇటువంటి ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని డి.పి. పుష్పనాథ్ యూత్ అసోసియేషన్ సభ్యులను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు బుల్లెట్ రాజు, హరి, శివ కిషోర్, తేరాల తేజ గుప్త, విశాల్, కార్తీక్, హర్షద్, షఫీ, సూర్య, దినేష్, మోనీష్ మరియు స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

