మాన ధ్యాస, మక్తల్: పట్టణంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ముందుగా చిన్న గణపతుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వాటిని శోభాయాత్రగా తీసుకెళ్లారు.ఈ సందర్బంగా మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజల్లో పాల్గొని అనంతరం భక్తులతో కలిసి వినాయక శోభాయాత్రలో పాల్గొని సందడి చేశారు.ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరీ మాట్లాడుతూ, మక్తల్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలను భక్తి, శాంతి, సోదరభావంతో నిర్వహించాలని కోరారు.శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయక నామస్మరణతో పట్టణాన్ని మార్మోగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
