.మన ధ్యాస, మక్తల్: పట్టణంలో ఈ నెల 10 వ తారీఖున ఏర్పాటు చేయనున్న చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరీ మాట్లాడుతూ, వీరనారి చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఆమె ఆశయాలను స్మరించుకుంటూ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.