మన ధ్యాస, మక్తల్: మండల పరిధిలోని కర్ని గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు గుడిగేండ్ల శ్రీనివాసు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట సురేష్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 20 లక్షల వ్యాయామంతో ఈ గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు, మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో నూతన భవన ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చెప్పడం చేపట్టడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మేహన్ రెడ్డి,సర్పంచ్ రాధా దత్తురాం ,ఉప సర్పంచ్ జయమ్మ, మాజీ MPTC గాసం రంగప్ప, మాజీ సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్ , వార్డ్ సభ్యులు చక్రధర్ ,బాలురాం,కుర్వ రవి, గాసం అనితా,రాంలింగప్ప,మారెప్ప,కలిమ్ . లడ్డు.గాసం నర్సింహా,వాకిటి వేంకటప్ప, గాసం శీను.గాసం హాన్ముతూవాకిటి, ఆర్ ఎం పి లింగప్ప, జేసి బి లింగప్ప, మైబుబ్ పాషా,ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *