కొండాపురం సెప్టెంబర్ 07 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం బీసీ బాలుర హాస్టల్లో కనీస వసతుల కొరతతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కొండాపురం మండల బీజేపీ అధ్యక్షులు జడపల్లి మహేష్ అధికారులను కోరారు.అలాగే కొండాపురం–కలిగిరి రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ, బీజేపీ చేపడుతున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా సంబంధిత సమస్యలను గ్రీవెన్స్‌లో నమోదు చేసి ఎంపీడీవో ఆదినారాయణ కి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ప్రజలకు మరియు ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన కొండాపురం–కలిగిరి రహదారిని వెంటనే అభివృద్ధి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చైతన్య, బీజేపీ ఉపాధ్యక్షులు కూకట్ల కృష్ణరావు, కార్యదర్శి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
