మన ధ్యాస, మక్తల్:మక్తల్ పట్టణంలోని సత్యసాయి ఆలయంలో వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరులను ఘనంగా సత్కరించారు. వనితా క్లబ్ అధ్యక్షురాలు ప్రసన్న నేతృత్వంలో,వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీ గుప్తా జన్మదిన వారోత్సవాల్లో భాగంగా,జర్నలిస్టులకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ, సమాజంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా,సమాజ శ్రేయస్సు కోసం జర్నలిస్టులు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. సీనియర్ జర్నలిస్టులు మామిళ్ల పృథ్వీరాజ్, అంబాదాస్, గోవిందు, సురేశ్ గౌడ్, రఘు, సురేష్, ప్రదీప్ కుమార్, హరి కృష్ణ, కార్తీక్ సన్మానం అందుకోగా.. ఈ కార్యక్రమంలోవనితా క్లబ్ సభ్యులు స్వాతి, వాసవీ మహిళా సంఘం మాజీ అధ్యక్షురాలు మనసాని సరళ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *