ఘనంగా శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆగస్టస్ జన్మదిన వేడుకలు. మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 2 :నెల్లూరు నగరంలోని గొలగమూడి రోడ్డు, హనుమాన్ జంక్షన్, అంజని బృందావనంలో ఆదివారంశ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ మరియు ఎండి బాబు ఆగస్టస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినవి. ఈ సందర్భంగా శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఉద్యోగస్తులు, కస్టమర్లు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్లాట్లు అమ్మినవారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఆదివారం నాడు ఫ్రెండ్షిప్ డే వేడుకలు, ఆగస్టు జన్మదినం ఒకేసారి రావడం వల్ల శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ లో ఆనందాలు వెలువెత్తాయి. ఈ కార్యక్రమంలో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఉద్యోగ సిబ్బంది, యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.



