కలిగిరి మండలం జిర్రవారి పాలెం ఎస్టీ కాలనీలో “ఇంటింటికి తెలుగుదేశం”కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష.
కలిగిరి ఆగస్టు 2, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కలిగిరి మండలం, జిర్రావారిపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీలో మండల అధ్యక్షులు పూసల వెంగప నాయుడు, ప్రధాన కార్యదర్శి కొప్పులు కొండలరావు ల ఆదర్వం లో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తూ చేపట్టిన కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రజలకు తెలియజేశారు. ముఖ్యంగా పేదలు, మహిళలు, రైతులు, వృద్ధులు, విద్యార్థులు మరియు బడుగు–బలహీన వర్గాలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సహకారంతో, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ యువ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి,కుడుములు దిన్నపాడు సొసైటీ చైర్మన్ బాసం నరసింహనాయుడు, ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ సభ్యులు కాకు మహేష్, జీరా చిన్న అంకిరెడ్డి, జీరా పెద్ద అంకిరెడ్డి, సతీష్, స్థానిక మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
